ఒకసారి కలసి నటించిన హీరో, హీరోయిన్ మళ్లీ కలసి నటించడం కొత్తేమీ కాదు. అయితే ఆ కాంబినేషన్ 24 ఏళ్ల తర్వాత కుదిరితే ఆశ్చర్యమే అని చెప్పాలి. ఎందుకంటే అన్నేళ్ల కెరీర్ ఇప్పుడు హీరోయిన్లకు లేదు. అయితే కొంతమంది హీరోయిన్లు అండ్ ఇప్పుడు దర్శకులు రాసుకుంటున్న కథల వల్ల అది జరుగుతోంది. అలా ఓ ఐకానిక్ కాంబో మరోసారి సెట్ అవుతోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 24 ఏళ్ల తర్వాత అజిత్, టబును ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు.
అజిత్ – టబు అనే కాంబో పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘ప్రియురాలు పిలిచింది’. ఇంకా చెప్పాలంటే ఆ పేరుకు ముందే ఓ పాట గుర్తొస్తుంది. ‘గంధపు గాలికి…’ అంటూ అజిత్ ఓ ఎడారిలో పాడుకునే విరహ గీతమది. అయితే నేటితరం యూత్ కూడా ఆ పాటను రిపీట్ మోడ్‌లో వింటారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఫీల్ అలాంటిది. దానికి అజిత్ నటన, టబు ఇన్నోసెంట్ ఎక్స్‌ప్రెషన్ అదిరిపోతాయి.
అలా ఆ పాటు ఐకానిక్ సాంగ్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ రేంజి సాంగ్ చూడలేం కానీ ఇద్దరినీ జంటగా చూడొచ్చు. కథానాయికగా, సహాయ నటిగా దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది టబు. ఇప్పుడామె కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పింది అంటున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు అజిత్ నటిస్తున్న సినిమాలో ఓ నాయికగా టబును (Tabu) అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ విషయంలో చర్చలు కూడా సాగాయి అంటున్నారు.
‘ఏకే 63’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోందని అంటున్నారు. అయితే ఎక్కడా అధికారిక సమాచారం లేదు. అంతేకాదు ఈ చిత్రంలో అజిత్‌కి పోటాపోటీగా నిలిచే విలన్‌గా అరవింద్ స్వామి నటిస్తారడట. అలాగే కీలక పాత్రలో ఎస్.జె.సూర్య కనిపిస్తాడట. త్వరలో ఈ విషయాలను టీమ్ అధికారికంగా ప్రకటిస్తుంది అంటున్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!