Tamannaah: తమన్నా బోల్డ్ రోల్స్ చేయడం వెనుక ఏకంగా ఇన్ని కారణాలు ఉన్నాయా?

Ad not loaded.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల కాగా ఈ రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. జైలర్, భోళా శంకర్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో థియేటర్లలో విడుదలవుతుండగా సంక్రాంతికి జరిగిన విధంగానే ఇప్పుడు కూడా రెండు సినిమాలలో తమన్నా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా జైలర్ లో తన రోల్ చిన్న రోల్ అని భోళా శంకర్ మూవీలో ప్రాధాన్యత ఉన్న రోల్ అని అన్నారు.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే మరో రెండు, మూడేళ్ల పాటు తమన్నా కెరీర్ కు ఢోకా ఉండదు. అయితే తమన్నా ఈ మధ్య కాలంలో బోల్డ్ రోల్స్ లో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బోల్డ్, ఇంటిమేట్ సీన్స్ చేయకపోతే ఆంటీని చేసేస్తారని తమన్నా పేర్కొన్నారు. కొత్త తరాన్ని టార్గెట్ చేసుకుని అలాంటి సీన్లలో నటిస్తున్నానని తమన్నా వెల్లడించడం గమనార్హం.

అభిమానులను మెప్పించడానికి ఇంటిమేట్ సీన్స్ చేయడానికి అంగీకరించాల్సి వస్తోందని తమన్నా వెల్లడించారు. ఇంటిమేట్ సీన్స్ లో నటించకపోతే యంగ్ హీరోలకు సిస్టర్, ఆంటీ పాత్రలను ఆఫర్ చేస్తారని తమన్నా వెల్లడించారు. హీరోయిన్ గా తమన్నా కెరీర్ ను కొనసాగించడానికే బోల్డ్ రోల్స్ లో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో కమర్షియల్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించాలని తమన్నా భావిస్తున్నారని తెలుసోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటానని తమన్నా భావిస్తున్నారు. తమన్నా కెరీర్ పరంగా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారని బోగట్టా. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి సంబంధించిన శుభవార్త ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. కథల ఎంపికలో తమన్నా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus