Tamanna: రెమ్యునరేషన్ ను పెంచేసిన తమన్నా.. కానీ?

  • October 17, 2021 / 05:44 PM IST

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా కెరీర్ ను కొనసాగించడం సులువైన విషయం కాదు. అయితే తమన్నా మాత్రం ఇప్పటికీ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అనే తేడాల్లేకుండా అందరు హీరోలకు జోడీగా నటిస్తూ తమన్నా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు ఈ హీరోయిన్ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తమన్నా ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు.

అయితే సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే మాత్రం తమన్నా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తమన్నా టీవీ షోలకు హోస్ట్ గా చేయడంతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. కథ నచ్చితే సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సైతం తమన్నా సిద్ధపడుతున్నారు. మాస్ట్రో సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన తమన్నా భవిష్యత్తులో మరిన్ని సపోర్టింగ్ రోల్స్ లో నటించే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా కోసం తమన్నా పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.

వెబ్ సిరీస్ లకు, వెబ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న తమన్నా మరో ఐదు సంవత్సరాలు నటిగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తమన్నా కెరీర్ కు ప్లస్ అయింది. తమన్నా కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటూ ఇతర హీరోయిన్లకు షాకిస్తున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus