Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

చేతిలో సినిమాలు లేవు అనుకున్నప్పుడల్లా ఓ సినిమా చేస్తూ ఎప్పుడూ నేను బిజీగానే ఉంటాను అని చెప్పకనే చెబుతుంది తమన్నా భాటియా. సినిమాలు తగ్గాయి అనిపిస్తే ఓ వెబ్‌సిరీస్‌ చేసేస్తుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ ఎక్కడో ఏదో సినిమా చేస్తూ ఉంటుంది. మరి అలా బిజీగా ఉండటమో, సినిమా ఛాన్స్‌లు రాకపోవడమో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో అయితే గ్యాప్‌ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు మరో సినిమా చేస్తోంది. అది కూడా స్టార్‌ హీరో సినిమాలోనే కావడం గమనార్హం.

Tamannaah

‘ఓదెల 2’ అంటూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌, డివోషనల్‌ టచ్‌ ఉన్న సినిమా చేసిన తమన్నా.. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. అయితే చేతిలో హిందీ సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ‘ఇరుముడి’ అనే తెలుగు సినిమా చేరిందని సమాచారం. రవితేజ – శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తమన్నాను సంప్రదించారని.. ఆమె కూడా ఓకే చెప్పింది అని సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. తమన్నా పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని, హీరోకు సమానంగా ఉంటుందని అని.. అందుకే ఆమె ఓకే చేసిందని అంటున్నారు. మరి ఆ పాత్రేంటి అనేది తెలియాల్సి ఉంటుంది. ఆ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరి ఓ పాత్రకు నాయికగా ఎంపిక చేశారా అనేది చూడాలి.

ఇక తమన్నా సినిమాల లైనప్‌ గురించి చూస్తే.. తమిళంలో విశాల్‌ ‘పురుషన్‌’లో నటిస్తోంది. తెలుగులో ‘మొగుడు’గా రానుందీ సినిమా. హిందీలో ‘వివాన్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌’, ‘రేంజర్స్‌2, ‘మారియా ఐపీఎస్‌’, ‘వి.శాంతారామ్‌’, ‘రాగిణి 3’, ‘బోలే చుడియాన్‌’, ‘హెరా ఫెరి 3’, ‘నో ఎంట్రీ 2’ సినిమాలు ఉన్నాయి. ఆ లెక్కన తమన్నా చాలా బిజీ.

ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus