పెళ్లి గురించి పెద్దలు, కవులు, రచయితలు చాలా విషయాలు చెప్పారు. ఎవరు ఎంత చెప్పినా.. పెళ్లి అనే అనుభూతి గురించి ప్రకతి ఒక్కరూ కొత్తగానే చెబుతారు. ఎందుకంటే ఎవరి అనుభూతి వారిది. తమదైన రోజున వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్షణాలను జీవితాంతం మరచిపోరు. వాటి గురించి ఎప్పుడు మాట్లాడినా హ్యాపీగానే ఉంటుంది. అలా టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు విజయ్ దేవరకొండ కూడా తన పెళ్లి నాటి క్షణాల గురించి తన ఆనందాన్ని మరోసారి బయటపెట్టాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు సినిమా పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకుముందు కొంతమంది సన్నిహిత అభిమానులకు గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు విరోష్ దంపతులు. ఇక పెళ్లి సందర్భంగా కుటుంబం, స్నేహితులతో కలసి గడిపిన ప్రతి క్షణాన్ని అందులోని మధురస్మృతులను గుర్తు చేసుకుంన్నారు కొత్త జంట.
పెళ్లి రోజు అరుదైన జ్ఞాపకాలకు సంబంధించిన మరికొన్ని ఫొటోలను రీసెంట్‌గా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లికి ముందు జరిగే ప్రదానం, మెహందీలో ఏం జరిగింది అనే వివరాలను ఫొటోల ద్వారా తెలిపారు. అత్యంత సరదాగా సాగిన సాయంత్రం ఇది. పూర్తి జీవితాన్ని ఆస్వాదించిన సాయంత్రమది. ఆ సాయంత్రం మరో 100 గంటలు ఉంటే బాగుంటుంది అని విజయ్ తన ఆనందాన్ని తెలిపాడు.
రష్మిక మందన కూడా కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ.. ‘చక్కటి సాయంత్రం.. చాలా త్వరగా అయిపోయింది అనిపించింది’ అని రాసుకొచ్చింది. ఈ క్రమంలో తమ పెళ్లి వస్త్రాలను డిజైన్ చేసిన సంస్థకు థ్యాంక్యూ కూడా చెప్పింది. చూస్తుంటే వీరి పెళ్లి ఫొటోల సిరీస్ ఇంకా కొనసాగేలా ఉంది. గత కొన్ని రోజులుగా రిలీజ్ చేస్తున్నా.. ఇంకా కొన్ని ఉన్నాయనిపిస్తోంది. ఇక వీరిద్దరూ కలసి నటిస్తున్న సినిమా ‘రణబాలి’ గురించి చూస్తే.. ఈ నెల 12న సినిమా సెట్‌లోకి కొత్త దంపతులు అడుగు పెట్టనున్నట్లు సమాచారం.