Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Advertisement

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా, రాజకీయ రంగంలో TVK పార్టీ అధినేత విజయ్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో చర్చనీయాంశంగా మారారు. ఆయన భార్య సంగీత భర్త నుంచి విడాకులు కోరుతూ చెంగల్‌పట్టు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు, ఏప్రిల్ 20న విచారణకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Vijay

విజయ్ – సంగీత దంపతులు 1999లో వివాహం చేసుకున్నారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ పెళ్లికి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరి మధ్య విభేదాలు ఉన్నాయనే రూమర్లు వినిపించినప్పటికీ, తాజాగా కోర్టు పిటిషన్ వార్తలతో అవి మరింత బలంగా మారాయి. అయితే పిటిషన్ లో వివాహేతర సంబంధమే కారణమని తెలుపుతూ, తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చారు ఆమె. పిటిషన్‌లో కొన్ని వ్యక్తిగత ఆరోపణలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్నా, దీనిపై ఇరువర్గాల నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న సమయంలో, విజయ్ ప్రొఫెషనల్ కెరీర్ కూడా కీలక మలుపులో ఉంది. ఆయన చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న ‘జన నాయగన్ ‘ విడుదల విషయంలో అనిశ్చితి నెలకొంది. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెన్సార్ సమస్యల కారణంగా సెన్సార్ బోర్డు (CBFC) వద్ద నిలిచిపోయినట్లు సమాచారం. సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వార్తలు విజయ్ చుట్టూ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus