పశ్చిమ ఆసియాలో ఇజ్రాయేల్, ఇరాన్..ల మధ్య యుద్దం జరుగుతున్న నేపధ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారి కుటుంబీకులు గందరగోళానికి గురవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మరోవైపు కొంతమంది ముస్లింలని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అనవసరంగా కొంతమంది సినీ సెలబ్రిటీలను ఇలాంటి గొడవల్లోకి లాగుతూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తనికెళ్ళ భరణి(Tanikella Bharani) వంటి సీనియర్ నటుడు కూడా ముస్లిం సోదరులను కించపరుస్తున్నట్టు ప్రచారం మొదలైంది. దీంతో తనికెళ్ళ భరణి రంగంలోకి దిగి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తనికెళ్ళ భరణి ఈ విషయం పై స్పందిస్తూ.. “ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే.. మొన్నెప్పుడో ఒకసారి ఒక థంబ్నెయిల్ పెట్టాడు. తనికెళ్ళ భరణి గారి ఆస్తి పాస్తులు బిల్డింగులు చూస్తే షాక్ అని.! నిజంగా అది చూశాక నేనే షాక్ అయ్యాను. ఒక అరడజను బిల్డింగులు దాని ముందు 6 కార్లు. సరే అది చూసి ఏదో సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే.. ప్రస్తుతం ఏదో దేశంపై యుద్దం జరుగుతుంది.
నేను ఒక వర్గాన్నే సపోర్ట్ చేస్తున్నట్టు, లేదా ఇంకో ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇలా నోటికొచ్చినట్టు పెట్టేస్తున్నారు. నేను అన్ని మతాల్ని,అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని, నేను ఏనాడూ ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు. భవిష్యత్తులో చెయ్యను. అందుచేత ఎవరో కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు అవి చూసి కొంచెం బాధపడి ఉండొచ్చు. ఎందుకంటే అన్ని వర్గాల్లో నాకు ఆత్మీయులు చాలా మంది ఉంటారు కాబట్టి..దయచేసి ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వొద్దు, ఎంకరేజ్ చేయొద్దు. శుభం భూయాత్.! నమస్కారం” అంటూ విన్నవించుకున్నారు.
సోషల్ మీడియా హద్దులు దాటుతొందా? pic.twitter.com/XKRqbSv2v8
— Tanikella Bharani (@TanikellaBharni) March 2, 2026