Tarun: మెగా ఇంటికి అల్లుడుగా తరుణ్… ఇందులో నిజమెంత?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో ఎన్నో ప్రేమకథ చిత్రాలలో నటించి లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి తరుణ్ క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి తరుణ్ తిరిగి సినిమాలలోకి రావాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నటుడు తరుణ్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది..

ఇప్పటికే (Tarun) తరుణ్ తో పాటు ఆయన కన్నా వయసులో చిన్న హీరోలు కూడా పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. కానీ తరుణ్ మాత్రం ఇప్పటివరకు పెళ్లి గురించి మాట కూడా మాట్లాడటం లేదు.అయితే ఈయన మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ విధంగా తరుణ్ గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తరుణ్ తల్లి నటి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కొడుకు కెరియర్ గురించి మాట్లాడుతూ త్వరలోనే తరుణ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిపారు. అదేవిధంగా తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే తరుణ్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈయన పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. రోజా రమణి చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగా తరుణ్ మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారు అంటూ ఓ వార్త సంచలనంగా మారింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి పెద్ద ఇంటి కూతురిని చేసుకోబోతున్నారని తెలిపారు.

అయితే అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు నందమూరి ఫ్యామిలీలో కూడా పెళ్లి వయసు ఉన్నటువంటి అమ్మాయిలు లేరు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఉన్నప్పటికీ తరుణ్ కన్నా వయసులో చాలా చిన్నది. ఇక మిగిలినది మెగా ఫ్యామిలీ మాత్రమే. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే శ్రీజా నిహారిక ఇద్దరు కూడా విడాకులు తీసుకొని మెగా ఇంట్లోనే ఉంటున్నారు. మరి వీరిద్దరిలో తరుణ్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి తరుణ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus