టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మధ్యకాలంలో ఎన్నో గొప్ప ఆలోచనలు చేస్తూ ఎంతోమందికి వివిధ రకాలుగా సహాయం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇక తాజా ఖుషి సినిమా విడుదలైన తర్వాత సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సక్సెస్ లో భాగమైనటువంటి తన అభిమానులకు ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. వందమంది ఫ్యామిలీలను ఎంపిక చేసి వారందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున చెక్ అందించారు.
ఈ విధంగా విజయ్ దేవరకొండ నుంచి ఎంతోమంది లక్ష రూపాయలు చెక్ పొంది ఫ్యామిలీ కోసం ఉపయోగించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నటుడు విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ పంపిణీ చేసిన లక్ష రూపాయలు అందుకున్నటువంటి వారిలో శ్రీకాకుళం కోటబొమ్మాళికి మండలం కురుడు గ్రామంలో షర్మిల శ్రీ అనే పాప కూడా ఒకరు.
ఇటీవల ఒక యాక్సిడెంట్ లో షర్మిల కాలు పోగొట్టుకుంది ఇక ఈ విషయం అక్కడి విజయ్ దేవరకొండ అభిమాన సంఘం విజయ్ దేవరకొండకు తెలియచేయడంతో చిన్నారికి లక్ష రూపాయలు చెక్ పంపించారు అయితే ఈ లక్ష రూపాయల చెక్కును ఎంపీ రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారికి చెక్కు పంపిణీ చేయడమే కాకుండా రామ్మోహన్ నాయుడు విజయ్ దేవరకొండకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
దైవం మనుష్య రూపేణ అనే వాఖ్యానికి అర్ధంగా నిలుస్తూ నటుడు విజయ్ దేవరకొండ గారు చేసిన సహాయంకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి తాను కూడా అండగా నిలబడతానని చెప్పి వారికి ఈ డబ్బులు వచ్చేలా చేసిన శ్రీకాకుళం విజయ్ దేవరకొండ అభిమానులను అభినందించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda) సంబంధించిన ఈ విషయం వైరల్ గా మారడంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!