పరభాషా దర్శకులతో తెలుగు హీరోలు సినిమాలు చేయడం అనేది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలు చాలా మంది పర భాషా దర్శకులతో పనిచేశారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు తమిళ స్టార్ దర్శకులతో సినిమాలు చేశారు. రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ తో, రామ్ దర్శకుడు లింగుస్వామి వంటి తమిళ దర్శకులతో సినిమాలు చేశారు.
ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయం పై తేజ సజ్జా క్లారిటీ ఇచ్చాడు.తేజ సజ్జా మాట్లాడుతూ..” నేను చాలా మంది దర్శకులను కలుస్తున్నాను. కథలు వింటున్నాను. అయితే ఒక రకంగా మీరు చెప్పింది కూడా నిజమే. ఒక తమిళ దర్శకుడితో నేను ట్రావెల్ అవుతున్నాను. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. అధికారికంగా ప్రకటిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. సో తమిళ దర్శకుడితో తేజ సజ్జ సినిమా అనేది నిజమే..!
అయితే ఆ దర్శకుడు ఎవరు? దాని నిర్మించే నిర్మాత ఎవరు? అది ఏ జోనర్ సినిమా వంటి వివరాలు మాత్రం తేజ సజ్జా రివీల్ చేయలేదు.