హస్బెండ్ ని పరిచయం చేసిన నటి తేజస్వి..!

హీరోయిన్ తేజస్వి మాదివాడ వెండితెరకు పరిచయమై చాలా కాలం అవుతుంది . 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈమె మొదటి చిత్రం. ఆ తరువాత ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా బోల్డ్ రోల్ చేసింది. తరువాత అనేక సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది. నటిగా వచ్చిన ఫేమ్ కంటే బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నాని హోస్ట్ గా ప్రసారమైన సీజన్ 2లో ఈమె పాల్గొంది.

హౌస్ లో గ్లామర్ డోసుతో పాటు, రొమాన్స్ లు, వాదనలు, వివాదాలతో రెచ్చిపోయింది. ఓ దశ దాటాక తేజస్విని ఆట్టిట్యూడ్ జనాలకు నచ్చలేదు. ఆమెపై ప్రేక్షకులకు నెగెటివ్ ఒపీనియన్ పెరిగిపోయింది. దీనితో హౌస్ నుండి ఎలిమినేట్ కాబడింది. షో వలన ఆమెకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయే తేజస్విని కమిట్మెంట్ అనే మూవీలో ఓ బోల్డ్ రోల్ చేయనుంది. ఆమె పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఆమె పోజ్ చాలా హాట్ గా ఉంది.

కాగా పుట్టిన రోజు తేజస్విని నా హస్బెండ్ అంటూ ఓ వ్యక్తితో కలిసున్న ఫోటో పంచుకుంది. ఇందేంటి తేజస్వినికి పెళ్లి కాలేదు కదా, హస్బెండ్ అంటుందేంటి అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. కొందరైతే అసలు ఆ వ్యక్తి ఎవరని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. హస్బెండ్ అనడానికి కాబోయే హస్బెండ్ అనడానికి చాలా తేడా ఉంటుంది. తేజస్వి అలా అందంటే ఆమెకు రహస్య వివాహం జరిగిందా అని కొందరు అనుకుంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus