Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

‘కోర్ట్’తో హీరోగా కూడా ఓ హిట్ అందుకున్నాడు హర్ష్ రోషన్. ఆ తర్వాత ‘బ్యాండ్ మేళం’ లో కూడా హీరోగా కూడా నటించాడు. అది అంతగా ఆడలేదు. ఇప్పుడు ‘తెల్లకాగితం'(Tella Kagitham) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన సినిమా ఇది. ‘అరుణాచల క్రియెషన్స్’ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్, ట్రైలర్ కంటే ఈ సినిమా నుండీ లీక్ అయిన కొంత ఫుటేజీ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.

Tella Kagitham

ఆ తర్వాత చిత్ర బృందం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఫైనల్ గా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.యూత్ ఫుల్ ఎలిమెంట్స్ అలాగే సెకండాఫ్ బాగున్నాయని అంతా చెప్పుకొచ్చారు. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ కోర్ట్ సినిమా రేంజ్లో అయితే కాదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

 నైజాం  0.48 cr
 సీడెడ్  0.12 cr
 ఆంధ్ర(టోటల్)  0.63 cr
 ఏపీ+తెలంగాణ(టోటల్)  1.23 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్  0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్ (గ్రాస్)  1.61 కోట్లు (షేర్)

‘తెల్లకాగితం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5 కోట్లు. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1.61 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.3 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.3.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా నిలబడితేనే బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది.

వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus