తమిళంలో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆనంది…అక్కడ మరో హిట్టు కొట్టేసింది..!

  • February 22, 2021 / 06:20 PM IST

మారుతీ డైరెక్షన్లో వచ్చిన ‘ఈరోజుల్లో’ ‘బస్ స్టాప్’ వంటి హిట్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆనంది గురించి బహుశా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ముందు ముందు ఈ అమ్మడి పేరు అందరి నోట్లోనూ నానే అవకాశం కచ్చితంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈమెను పెద్దగా కాన్సన్ట్రేట్ చెయ్యకపోయినా.. కోలీవుడ్ కు చెక్కేసి అక్కడ సైలెంట్ గా పాపులర్ అయిపోతుంది. ఇప్పటి వరకూ అక్కడి సినిమాల్లో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను చేస్తూ వస్తున్నా ఆనంది అక్కడ బాగానే క్లిక్ అయ్యింది. అయితే తొలిసారి ఈమె అక్కడ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది.

అదే ‘క‌మ‌లి ఫ్ర‌మ్ న‌డుక్క‌వేరి’. ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌ర్ దురైస్వామి డైరెక్ట్ చేసాడు. ఓ విలేజ్ కు చెందిన అమ్మాయి ఎన్నో క‌ష్టాల‌ను, అడ్డంకుల‌ను ఎదుర్కొంటూ వాటిని అధిగ‌మించి ఐ.ఐ.టీ చ‌ద‌వాల‌న్న త‌న కోరిక‌ను ఎలా సాకారం చేసుకుంది అనే పాయింట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది.అంతేకాదు విద్యా వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌ను కూడా ఎత్తి చూపుతూ.. అందరినీ ఆలోచింపచేసేలా చాలా ఎమోషనల్ గా ఈ చిత్రం సాగింది. ఈ ఏడాది అదే తమిళంలో విడుదలైన సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అంటూ క్రిటిక్స్ ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కమర్షియల్ గా కూడా ఈ చిత్రం అక్కడ మంచి వసూళ్లనే నమోదుచేస్తుంది. ఏకంగా విశాల్ ‘చక్ర’ సినిమాని కూడా సైడేసేసేలా ఈ చిత్రం అక్కడ పెర్ఫార్మ్ చేస్తుందట.ఇక తెలుగులో ఈ మధ్యన ఆనంది నటించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రం కూడా బాగా ఆడింది. భవిష్యత్తులో ఈమె మరిన్ని కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలను చేస్తూ పెద్ద స్టార్ అయిపొతుందెమో అని కొందరు ఈమె గురించి కామెంట్లు చేస్తుండడం విశేషం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus