బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి వారం ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ నామినేషన్స్ లో చూస్తే 8మంది ఉన్నారు. వారిలో అన్ అఫీషియల్ సైట్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారు. అసలు ఓటింగ్ ఆర్డర్ ఏంటి అనేది ఒక్కసారి చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ – 24 శాతం తో నెంబర్ 1 లో ఉన్నాడు. నెంబర్ 2 – రతిక – దాదాపు 20 శాతం వరకూ ఓటింగ్ ని ప్రబావితం చేసింది. 2వ ప్లేస్ లో ఉంది.
నెంబర్ 3 – 4 ప్లేస్ లో శోబాశెట్టి ఇంకా గౌతమ్ కృష్ణ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డారు. ఇద్దరూ దాదాపు 15శాతం ఓటింగ్ ని ప్రబావితం చేశారు. శోభాశెట్టి ఇంకా గౌతమ్ కృష్ణ ఇద్దరూ కూడా సేఫ్. నెంబర్ 5 లో షకీలా 9 పర్సెంట్ తో కొద్దిగా సేఫ్ జోన్ లోనే ఉంది. నిజానికి షకీలా నుంచీ అందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు.
ర్వాత మిగిలిన ముగ్గురులో థామినీ కొద్దిగా బెటర్ పొజీషన్ కి వచ్చింది. 7శాతం ఓటింగ్ తో సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ప్రిన్స్ యవార్ ఇంకా కిరణ్ రాధోడ్ మిగిలిన 10 పర్సెంట్ పంచుకున్నారు. ఇందులో కూడా ప్రిన్స్ కి 6శాతం వరకూ ఓటింగ్ ఉంటే., కిరణ్ కి 4శాతం మాత్రమే ఉంది. అంటే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఇక్కడ చూడండి కేవలం డేంజర్ జోన్ లోకి 3శాతం వరకూ మాత్రమే ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి అఫీషియల్ ఓటింగ్ లో ఏదైనా జరగచ్చు. కానీ, ఫస్ట్ వీక్ కాబట్టి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది పెద్ద ట్విస్ట్. ఎందుకంటే, ఈసారి పార్టిసిపెంట్స్ ఎవ్వరినీ కన్ఫార్మ్ చేయలేదు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. కాబట్టి ఈసారి ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ లేవనే విశ్లేషకులు చెప్తున్నారు.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!