Star Actor: స్టార్‌ కమెడియన్‌ – స్టార్‌ హీరో అంతా మరచిపోయి నటిస్తున్నారా? లేక ఏమైనా ట్విస్ట్‌ ఉందా?

పవన్‌ కల్యాణ్‌ సినిమా అంటే కథ, కథనం, నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు, నిర్మాత.. ఇలా వీళ్లందరూ ఎంత ముఖ్యమో.. అలీ కూడా అంతే ముఖ్యం. ఈ మాట మేం అన్నది కాదు. ఆయన సినిమాలు చూసేవాళ్లు ఎవరైనా ఇదే మాట అంటారు. పీకే సినిమాలో అలీ లేకపోవడం అనేది అసాధ్యం. కనీసం ఒక్క ఫ్రేమ్‌లో అయినా అలీ కనిపిస్తాడు అని చెప్పొచ్చు. అయితే ‘అజ్ఞాతవాసి’ నుండి పరిస్థితి మారిపోయింది. పవన్‌ సినిమాలో అలీ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ‘ఓజీ’తో మళ్లీ ఆ కాంబో చూడొచ్చు అంటున్నారు.

అవును, మీరు చదివింది నిజమే. ‘ఓజీ’ సినిమా కోసం అలీని కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకు కీలక నటులను ఎలా పరిచయం చేశారో, అలీ పాత్రను కూడా అలానే పరిచయం చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ నటిస్తే మాత్రం పవన్‌ ఫ్యాన్స్‌కి, అలీ ఫ్యాన్స్‌కి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబోకు హీరో – హీరోయిన్‌ కాంబోకి ఉన్నంత క్రేజ్‌ ఉంది. ఇద్దరి కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌ సింక్‌ అవుతుంది. దీంతో మరోసారి ఆ మజా ఎంజాయ్‌ చేయొచ్చు.

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. సుమారు 400 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో టీమ్‌ నుండి అధికారిక సమాచారం రాలేదు కానీ.. ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు. పాన్‌ ఇండియా రేంజిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో పవన్‌ భారీ స్థాయిలో పాన్‌ ఇండియా హీరో అవుతారని అంటున్నారు. ఇప్పటివరకు పవన్‌ నుండి పాన్‌ ఇండియా సినిమా అంటే ‘హరి హర వీరమల్లు’ మాత్రమే. అయితే ఆ సినిమా ఎక్కడివరకు వచ్చిందో తెలియదు.

ఈ నేపథ్యంలో (Star Actor) పవన్‌ పాన్‌ ఇండియా సినిమా ఆలస్యం అవుతుందేమో అనుకున్నారు. కొందైతే ఆ అవకాశం లేదే అనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని కోట్ల రూపాయల సినిమా అంటే కచ్చితంగా పాన్‌ ఇండియా రిలీజ్‌, బజ్‌, క్రేజ్‌ అన్నీ వస్తాయి. దానికి తగ్గ హైప్‌ ఇప్పటికే టీమ్‌ నుండి పెరుగుతూ వస్తోంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus