రీల్ లైఫ్‌లో హీరోతో లవ్‌లో పడి రొమాన్స్ చేసే హీరోయిన్స్ రియల్ లైఫ్‌లోనూ లవ్ స్టోరీలు నడుపుతున్నారు. కో స్టార్స్‌ని లవ్ చేసి పెళ్లిళ్లు చేసుకున్నావారు.. ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకుని ఒంటరిగా ఉండిపోయిన వాళ్లు.. అలాగే ఎక్కువసార్లు లవ్‌లోకి దిగిన వారూ ఉన్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో లవ్, రిలేషన్‌షిప్, బ్రేకప్ లాంటివి సహజం.. సాధారణంగా కథానాయికల్ తమ క్రష్, లవ్ గురించి పెద్దగా బయటకు చెప్పరు.. సహనటుడితో కలిసి బయటెక్కడైనా కనిపిస్తే..
ఇక ఆ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయిపోతుంటుంది.. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం.. వాళ్లకి ఏ వయసులో, ఎప్పుడు లవ్ పుట్టిందో ధైర్యంగా చెప్పేశారు.. హైలెట్ ఏంటంటే.. దాదాపుగా అందరికీ వారి స్కూలింగ్ టైంలోనే ప్యార్ పుట్టుకొచ్చింది.. క్రష్ ఫీలింగ్ కలిగింది.. అలా తమ లవ్ స్టోరీస్ రివీల్ చేసిన బాలీవుడ్ టు కోలీవుడ్‌కి చెందిన ఐదుగురు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1) శృతి హాసన్..
యాక్ట్రెస్ కమ్ మ్యూజీషియన్ అయిన శృతి హాసన్ స్కూల్ ఏజ్‌లోనే ఓ అబ్బాయితో ప్రేమలో పడిందట.. ఇక నటిగా కెరీర్ స్టార్ట్ చేశాక సిద్ధార్థ్‌తో, లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో బ్రేకప్ చేసుకుంది.. కొద్ది రోజులుగా శంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉంది..
2) నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్ అయితే తను నాలుగో క్లాస్ చదువుతున్నప్పుడు ప్రేమ పాఠాలు చెప్పుకునేదట..
3) అనసూయ భరద్వాజ్..
స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ 15 ఏళ్లకే తన భర్త సుశాంక్ భరద్వాజ్‌తో లవ్ స్టోరీ స్టార్ట్ చేసిందట..
4) తాప్సీ పన్ను..
బ్యూటీఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను తను తొలిసారిగా 9వ తరగతిలో ఉన్నప్పుుడు ప్రేమలో పడ్డానని ఓ ఇంటర్వూలో చెప్పింది..
5) కైరా అద్వానీ..
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సందడి చేస్తున్న కైరా అద్వానీ ఫస్ట్ క్రష్ తన 10వ తరగతి టైంలో అని రివీల్ చేసింది..