The Family Star Collections: ‘ఫ్యామిలీ స్టార్’.. 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 15, 2024 / 04:37 PM IST

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram) దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.

పండుగ పేరు చెప్పుకుని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. మరి సెకండ్ వీకెండ్ ఎలా క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 5.56 cr
సీడెడ్ 1.03 cr
ఉత్తరాంధ్ర  1.22 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.55 cr
గుంటూరు 0.67 cr
కృష్ణా 0.62 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 10.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.26 cr
 ఓవర్సీస్ 4.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.98 cr (షేర్)

‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.24.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus