The Family Star Collections: ఫ్యామిలీ స్టార్.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 7, 2024 / 03:23 PM IST

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పరశురామ్( బుజ్జి) (Parasuram)  దర్శకత్వంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam)  తర్వాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజు (Dil Raju) నిర్మాత. టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.75 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.45 cr
ఈస్ట్ 0.26 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.24 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.35 cr
 ఓవర్సీస్ 2.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.18 cr (షేర్)

‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకి రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.6.18 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.35.32 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus