మహేష్ జక్కన్న కాంబో మూవీపై షాకింగ్ న్యూస్ వైరల్!

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా వచ్చే ఏడాది జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. రాజమౌళి గత సినిమాలకు భిన్నంగా విదేశాల్లో ఎక్కువగా ఈ సినిమా షూటింగ్ జరగనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అవతార్ తరహాలో ఈ సినిమాను కూడా ఫ్రాంఛైజీలుగా తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నారని సమాచారం అందుతోంది.

మహేశ్ జక్కన్న కాంబో మూవీకి మరిన్ని సీక్వెల్స్ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. రాజమౌళి ఇప్పటికే బాహుబలి3, ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్స్ ప్లానింగ్ లో ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలతో పాటు మహేష్ మూవీకి కూడా సీక్వెల్స్ తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ వద్ద జక్కన్న హవా మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. మహేష్ ఈ సినిమా కోసం రెండేళ్లు డేట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ఏ హీరోయిన్ సొంతమవుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళికి అడ్వాన్స్ ఇస్తామని ఇతర దర్శకనిర్మాతలు భారీ ఆఫర్లు ఇస్తున్నా జక్కన్న మాత్రం ఆ ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నట్టు సమాచారం. రాజమౌళి వేగంగా సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా వస్తుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో జక్కన్న బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. మహేష్ సైతం రాజమౌళి సినిమాలో నటిస్తూనే మరో ప్రాజెక్ట్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లు ఎవరి డైరెక్షన్ లో తెరకెక్కుతాయనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus