Boyapati Srinu, Balakrishna: ఆరోజు బాలయ్య బోయపాటి శ్రీను కాంబో ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా?

  • April 1, 2024 / 06:16 PM IST

బాలయ్య (Balakrishna) బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ (Akhanda) సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని కొన్నిరోజుల క్రితం బోయపాటి శ్రీను సమక్షంలో బాలయ్య ప్రకటన చేశారు. 14 రీల్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్నికలకు 40 రోజుల సమయం మాత్రమే ఉండగా ఎన్నికలు పూర్తయ్యే వరకు బాలయ్య షూటింగ్ లకు హాజరు కాలేదు.

బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ షూట్ జరుగుతుందని బాలయ్య లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ కాలేదని సమాచారం అందుతోంది. కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ చేయనున్నారని భోగట్టా. ఉగాది పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

ఉగాది పండుగ కానుకగా బాలయ్య బోయపాటి శ్రీను కాంబో సినిమాకు సంబంధించి ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అఖండ అని ఫ్యాన్స్ భావిస్తారు. అఖండ సినిమాను మించిన హిట్ ను బాలయ్యకు అందించడం బోయపాటి శ్రీనుకే సాధ్యమవుతుందని చెప్పవచ్చు. బాలయ్య రేంజ్ ను పెంచే స్క్రిప్ట్ తో బోయపాటి శ్రీను తర్వాత సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.

స్కంద (Skanda) సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పాటు బోయపాటి శ్రీను డైరెక్షన్ స్కిల్స్ పై విమర్శలకు కారణమైంది. బోయపాటి శ్రీను సినిమాలు ఒకే తరహాలో ఉండబోతున్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను నవ్యత ఉన్న కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తే తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. బోయపాటి శ్రీను సినిమాలు బాలీవుడ్ ఆడియన్స్ కు ఎంతగానో నచ్చుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus