The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

నేచురల్ స్టార్ నాని హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise). ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మోహన్ బాబు అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు.

The Paradise

‘ఆయా షేర్’ ‘ఏష నాగుల’ పాటలు చార్ట్ బస్టర్ అయ్యి ఈ సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నాని బాగా నటించినప్పటికీ, మోహన్ బాబు పాత్ర పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ నిర్మాత బాగా డబ్బులు పెట్టినప్పటికీ… దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా ‘ది ప్యారడైజ్’కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 2వ వీకెండ్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఒకసారి 11 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  38.91 cr
సీడెడ్  6.31 cr
ఉత్తరాంధ్ర  6.14 cr
ఈస్ట్  3.81 cr
వెస్ట్  1.95 cr
గుంటూరు  3.48 cr
కృష్ణా  2.87 cr
నెల్లూరు  1.78 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  65.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ హిందీ  12.69 cr
ఓవర్సీస్  14.52 cr
వరల్డ్ వైడ్ టోటల్  92.46 cr (షేర్)

‘ది ప్యారడైజ్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.96.3 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.97 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.92.46 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.158.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.4.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus