టాలీవుడ్‌లో మ్యూజిక్ బిజినెస్‌కు కొత్త నిర్వచనం ఇచ్చేలా ‘ది ప్యారడైజ్’ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క పాట కూడా బయటకు రాకముందే ఈ సినిమా ఆడియో హక్కులు భారీ స్థాయిలో అమ్ముడవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం హీరో నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఉన్న అపారమైన నమ్మకం.
వీరిద్దరి తొలి చిత్రం ‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయం మరియు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంతా కాదు . రా అండ్ రస్టిక్ కథనంతో, నాని కెరీర్‌లోనే డిఫరెంట్ షేడ్ చూపించిన ఆ సినిమా ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేసింది. ఇప్పుడు అదే జోడీ నుంచి వస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
సాధారణంగా ఆడియో రైట్స్ విలువ హీరో మార్కెట్, మ్యూజిక్ డైరెక్టర్ క్రేజ్‌పై ఆధారపడుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి దాదాపు రూ.18 కోట్ల వరకు ఆడియో బిజినెస్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నాని కెరీర్‌లోనే భారీ మ్యూజిక్ డీల్‌గా చెప్పుకోవచ్చు. గతంలో సంతోష్ నారాయణన్ సంగీతం ‘దసరా’కి ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. ‘ది ప్యారడైజ్’లో కూడా మ్యూజిక్ సినిమాకి కీలకంగా మారనుందని సమాచారం.కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని పూర్తిగా మునుపెన్నడూ కనపడని కొత్త లుక్‌లో కనిపించనున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ మొదలుకాకముందే ఇంతటి బిజినెస్ జరగడం ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ రిలీజ్ అవుతుందనే అంచనాలతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.