నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు అందుకే దూరమయ్యాను : అక్కినేని

  • December 7, 2020 / 06:27 PM IST

సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే ముందు వరకూ అక్కినేని నాగేశ్వర రావు గానే.. నెంబర్ 1 హీరోగా చలామణి అయ్యేవారన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రేమకథా చిత్రాలతోనూ.. ఎనర్జిటిక్ డ్యాన్స్ లతోనూ ఆయన అప్పటి యూత్ ను విపరీతంగా ఆకట్టుకునేవారు. ఆయన దాదాపు అన్ని రకాల పాత్రలు పోషించారు కానీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రం ఆయన ఎప్పుడూ టచ్ చెయ్యలేదు. కొంచెం చాదస్తపు ముసలాయన పాత్రలను మాత్రం ఆయన చాలా చేశారు.

ఆ టైములో చాలా మంది ప్రేక్షకులు అక్కినేని నాగేశ్వర రావు గారు నెగిటివ్ షేడ్స్ లేదా విలన్ పాత్రలను ఆయన ఎందుకు పోషించలేదు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారి దగ్గర నుండీ మన ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్లు నెగిటివ్ రోల్స్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే నటనలో ఎంతో ఆరితేరిన అక్కినేని గారు..

విలన్ లేదా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు ఎందుకు దూరంగా ఉన్నారో అనే విషయం పై ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రతినాయకుడు లేదా వికృత పాత్రలు అనేవి చెయ్యడం పెద్ద ఛాలెంజ్. నా పర్సనాలిటీ(రూపం), కంఠం అలాంటి పాత్రలకు సెట్ అవ్వవు. ప్రేక్షకులు కూడా నన్ను అలా యాక్సెప్ట్ చెయ్యరు. అందుకే ఎప్పుడూ అలాంటి ప్రయోగాలు చెయ్యలేదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus