Doctor Babu: పరిటాల రవి డాక్టర్ బాబుకు ఏమవుతారో తెలుసా..?

Advertisement

పదుల సంఖ్యలో సినిమాల్లో, సీరియళ్లలో నటించినా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ద్వారానే నిరుపమ్ గుర్తింపును సంపాదించుకున్నారు. నిరుపమ్ అనే సొంత పేరు కంటే డాక్టర్ బాబు అంటేనే తెలుగు ప్రేక్షకులు నిరుపమ్ ను సులభంగా గుర్తు పడతారు. తాజాగా నిరుపమ్ తన భార్య, సీరియల్ నటి మంజులతో కలిసి అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరయ్యారు. ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ తో తన కెరీర్ ప్రారంభమైందని ఆ సీరియల్ తో తనకు మంచి పేరు వచ్చిందని తనకు చంద్రముఖి కూడా దొరికిందని డాక్టర్ బాబు అన్నారు.

మంజులను ప్రేమించానని చెప్పగానే అమ్మ ఇంటికి తీసుకొనిరమ్మని చెప్పారని నిరుపమ్ తెలిపారు. అష్టాచమ్మా సినిమాలో హీరో రోల్ కోసం అడిషన్స్ కు పిలిచారని అయితే అప్పటికే వేరే సీరియల్ లో నటిస్తుండటంతో ఆ ఆఫర్ మిస్సైందని నిరుపమ్ చెప్పారు. తన ఇంటి పేరు పరిటాల కావడం వల్ల జరిగిన లాభం గురించి చెబుతూ పరిటాల రవి పేరు తనకు ఉపయోగపడిందని నిరుపమ్ అన్నారు. ఇంద్ర సినిమా ఫస్ట్ డే థియేటర్ కు వెళ్లి ఆగగానే కానిస్టేబుల్ బైక్ కీ తీసుకున్నాడని ఆ తరువాత పరిటాల రవికి ఫోన్ చేస్తానని చెప్పడంతో తాళాలు వెనక్కు ఇవ్వడంతో పాటు ఇంద్ర సినిమా టికెట్ కూడా కానిస్టేబుల్ ఇచ్చాడని నిరుపమ్ వెల్లడించారు.

ఒక సీరియల్ లో తాను నటిస్తున్న సమయంలో చెప్పులదండతో సన్మానం చేస్తామని కాల్స్ వచ్చాయని నిరుపమ్ పేర్కొన్నారు. సీరియల్ లోని పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో ఆ విధంగా చేసేవారని నిరుపమ్ వెల్లడించారు. పరిటాల రవికి, నిరుపమ్ కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేకపోయినా ఆయన తన బంధువని చెప్పడం వల్ల మేలు జరిగిందని నిరుపమ్, మంజుల వెల్లడించారు.


థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus