Tollywood: టాలీవుడ్‌లో డిజాస్టర్స్ ట్రెండ్ పెరుగుతోందా?

Advertisement

గత పదేళ్ళలో సౌత్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టాలీవుడ్ (Tollywood) ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిన ఇండస్ట్రీగా పేరుగాంచింది. బాహుబలి (Baahubali), పుష్ప (Pushpa) లాంటి బిగ్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత పాన్ ఇండియా సినిమాల జోరు మరింత పెరిగింది. 100 కోట్ల మార్క్‌ను చేరిన సినిమాలే గర్వించాల్సిన స్థాయిలో ఉండగా, ఇప్పుడు 500 కోట్లు, 1000 కోట్లు వసూలు చేసే సినిమాలు వస్తున్నాయి. కానీ మరో వైపు, భారీ నష్టాలను మూటగట్టుకుంటున్న చిత్రాల సంఖ్య కూడా పెరుగుతోంది.

Tollywood

బడ్జెట్ పెరిగిన కొద్దీ కథను పట్టించుకోకుండా సినిమాలు తీస్తే, ఫలితం ఘోరమైన నష్టాలే అని తాజా ఫ్లాపులు నిరూపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో అత్యధిక నష్టాలను మూటగట్టుకున్న చిత్రాల్లో గేమ్ చేంజర్ (Game Changer), రాధేశ్యామ్ (Radhe Shaym), ఆచార్య (Acharya) మొదటి స్థానాల్లో ఉన్నాయి. రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, కథాపరంగా దారుణంగా విఫలమై, ట్రేడ్ లెక్కల ప్రకారం దాదాపు 100 కోట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. అలాగే ప్రభాస్ (Prabhas) నటించిన రాధేశ్యామ్ కూడా అదే విధంగా బాక్సాఫీస్‌ను నిరాశపరిచింది.

లవ్ స్టోరీ పాన్ ఇండియా రేంజ్‌లో క్లిక్ అవుతుందనుకున్నారు కానీ, ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా నిర్మాతలకు 120 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య భారీ హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం, భారీ ప్రీ-రిలీజ్ హైప్ కూడా సినిమా ఆడేందుకు సహాయపడలేదు. 150 కోట్లకు పైగా నష్టాన్ని చూసిన ఈ సినిమా, మెగా హీరోల కెరీర్‌లో ఒక బిగ్ ఫ్లాప్‌గా నిలిచింది.

ఈ భారీ నష్టాల వల్ల టాలీవుడ్‌లో నిర్మాణ వ్యయాలను కంట్రోల్ చేయాలనే చర్చ మొదలైంది. బడ్జెట్ పెంచడం, భారీ గ్రాండ్ విజువల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కాదు, కథ ప్రధానంగా ఉండాలని నిర్మాతలు గ్రహిస్తున్నారు. అటు, కొత్తగా రాబోయే భారీ సినిమాలు కూడా ఇదే విధంగా నష్టాల్లోకి వెళ్ళకూడదనే జాగ్రత్త తీసుకుంటున్నారు. బడ్జెట్‌, కంటెంట్‌, కమర్షియల్ హైప్ అన్ని బ్యాలెన్స్ లో ఉంటేనే సినిమా హిట్ అవుతుందని తాజా పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై టాలీవుడ్ ట్రెండ్ మారుతుందా? లేక ఇలాగే భారీ నష్టాలు కొనసాగుతాయా? అనేది చూడాలి.

అంటే సలార్ 2 వచ్చేది అప్పుడేనా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news