బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?

Advertisement

నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) భారత ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య సినీ ప్రస్థానం, ప్రజా సేవ, క్యాన్సర్ ఆసుపత్రి వంటి సేవా కార్యక్రమాలు ఈ గౌరవానికి అర్హతను నిరూపించాయి. త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోనున్న నటసింహం కోసం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఒక ప్రకటనను పత్రికల్లో ప్రచురించారు. ఈ ప్రకటనలో బాలయ్య జీవితాన్ని ప్రశంసిస్తూ.. కుటుంబ సభ్యుల పేర్లు జత చేశారు.

Jr NTR, Balayya

ఇందులో ఆయన భార్య, పిల్లలు, అక్కాచెల్లెళ్ళు, సోదరుల పేర్లు ఉన్నాయి. కానీ, జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR), కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) పేర్లు లేవు. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎందుకు ఎన్టీఆర్ పేరును ముద్రించలేదు? అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు కావాలని ఆయనను తప్పించారని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఓ విషయం అర్థం చేసుకోవాలి. ప్రకటనలో బాలకృష్ణ కుటుంబ సభ్యుల పేర్లతోపాటు, ఆయన తోబుట్టువుల పేర్లు ఉన్నాయి. కానీ వారి పిల్లల పేర్లు ఎవరూ ముద్రించలేదు.

అంటే, బాలయ్య సోదరులంతా (హరికృష్ణ (Harikrishna), మోహన కృష్ణ (Mohanakrishna), రామకృష్ణ (Ramakrishna) ) ఉండగా, వారి సంతానం పేర్లు వేయలేదు. అదే లాజిక్ ప్రకారం, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మిస్ అయ్యాయి. ఎన్టీఆర్ మూడవ జనరేషన్ లో అందరూ సమానమే అనేలా భావించి ఉండవచ్చు. ఒకవేళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల పేర్లు కూడా వేయాలని అనుకుంటే, కుటుంబ వృక్షం మొత్తం ముద్రించాల్సి వచ్చేది. అది పెద్దగా రీజన్ కాకపోయినా కేవలం పెద్దల పేర్ల వరకే పేర్లు ఉంచారు.

అయితే ఈ విషయం అర్థం చేసుకోకుండా అనవసరంగా కొందరు వివాదాలు క్రియేట్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు అని ఓ వర్గం ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ – బాలయ్య మధ్య మంచి బాండింగ్ ఉందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బాలయ్యకు అవార్డు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఆయనను అభినందిస్తూ, “బాలా బాబాయ్, మీరు పద్మభూషణ్ అందుకోవడం మా అందరికీ గర్వ కారణం” అంటూ పోస్ట్ చేశారు.

అదే విధంగా, బాలయ్య కూడా ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి ఎక్కడా నెగటివ్ గా మాట్లాడలేదు. అందుకే, ఈ ప్రకటన విషయంలో లాజిక్ ఆలోచించకుండా, ఫ్యామిలీలో విబేధాలు ఉన్నట్లు అనుకోవడం అంతగా కరెక్ట్ కాదు. అయితే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తన పేరు మిస్ అవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య-ఎన్టీఆర్ మధ్య బంధం ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉంది కానీ, ఇలా చిన్న విషయాలు ఊహాగానాలకు దారి తీస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news