బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దేవర సినిమా షూటింగ్ లో భాగంగా గాయాలపాలైన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆపరేషన్ చేయించుకుని వైద్య చికిత్స పొందుతున్నారు. అయితే సైఫ్ అలీఖాన్ తన హెల్త్ గురించి అప్ డేట్ ఇవ్వగా ఆ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాకు అయిన గాయం ఎంత తీవ్రంగా ఉందో చెప్పలేనని దేవర మూవీ కోసం యాక్షన్ సీన్ చేస్తున్న సమయంలో గతంలో గాయమైన చోట మళ్లీ గాయమైందని ఆయన అన్నారు. భుజం నొప్పి పెరగడంతో ఎం.ఆర్.ఐ చేయించుకున్నానని ఆ సమయంలో కచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందని తేలిందని ఆయన చెప్పుకొచ్చారు. సర్జరీ అనుకున్న విధంగా అనుకున్న సమయానికి చెయ్యని పక్షంలో చేతిలో కొంత భాగం కోల్పోయేవాడినని సైఫ్ అలీ ఖాన్ అన్నారు.
వైద్యులు ఎముకలో కొన్ని కోతలు కోసి గాయాన్ని నయం చేస్తారని నెలరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని త్వరలో డిశ్చార్జ్ అవుతానని సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan) ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
దేవర రిలీజ్ డేట్ మారుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర మూవీ నుంచి త్వరలో టీజర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా టీజర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. దేవర మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా నాన్ థియేట్రికల్ హక్కులతో 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆదాయాన్ని సాధించిందని తెలుస్తోంది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!