Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ క్లైమాక్స్ విషయంలో అంత కథ నడిచిందా?

‘కల్కి..’ (Kalki 2898 AD)  సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ని రాబట్టుకుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin)  డైరెక్షన్ కి అంతా ఫిదా అయిపోయారు. ఇతనిలో ఈ రేంజ్ టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. నైజాం లో అలాగే నార్త్ లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని సాధిస్తుంది. ఇదిలా ఉండగా.. ‘కల్కి..’ సినిమాలో ప్రేక్షకులు అందరినీ ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్లి గూజ్ బంప్స్ తెప్పించిన ఎపిసోడ్ క్లైమాక్స్ అనే చెప్పాలి.

ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఓ అద్భుతం. అప్పటివరకు ప్రభాస్ (Prabhas) కంటే అమితాబ్ (Amitabh Bachchan) పాత్రనే హైలెట్ అవుతూ ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో ప్రభాస్.. ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. అయితే ఈ క్లైమాక్స్ వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. అవును.. వాస్తవానికి క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణ క్యారెక్టర్ తో పోల్చి ఎలివేషన్ ఇవ్వడం అనేది మొదట నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ లో లేదట.కానీ కొన్నాళ్ళు షూటింగ్ జరిగిన తర్వాత..

నాగ్ అశ్విన్ తో క్లైమాక్స్ డిస్కషన్స్ లో ఉన్నప్పుడు.. ప్రభాస్ కి క్లైమాక్స్ లో ఏ రేంజ్ హై ఇవ్వాలి అనే డైలమాలో ఉన్నాడట. దీంతో తన పాత్రను కూడా పురాణాలతో లింక్ పెట్టి.. హైలెట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడట ప్రభాస్. ఇది నాగ్ అశ్విన్ కి నచ్చింది. అలా కర్ణుడి పాత్రతో లింక్ పెట్టి.. ప్రభాస్ పాత్రని మరింత హైలెట్ చేశాడు నాగ్ అశ్విన్. సెకండ్ పార్ట్ కి అది మరింత మైలేజ్ ఇచ్చినట్టు అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus