Manjula: మంజుల పెళ్లి గురించి మనకు తెలియని విషయాలు..!

  • July 20, 2021 / 11:09 PM IST

సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.అప్పట్లో రామారావు,నాగేశ్వరావు వంటి స్టార్ హీరోలకు కూడా చమటలు పట్టించిన స్టార్ హీరో. ఇప్పుడు ఆయన వారసుడిగా మహేష్ బాబు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.అంతేకాదు కృష్ణ గారి రెండో కూతురు మంజుల సైతం సినిమాల్లో రాణించారు. నీలకంఠ దర్శకత్వంలో ఈమె నిర్మించిన ‘షో’ చిత్రానికి గాను నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. దర్శకురాలిగా కూడా మారి సందీప్ కిషన్ తో ‘మనసుకి నచ్చింది’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది మంజుల.

అంతేకాకుండా ‘ఆరెంజ్’ సినిమాలో చరణ్ అక్క పాత్రలో కూడా ఈమె నటించి మెప్పించారు.నందమూరి బాలకృష్ణ నటించిన టాప్ హీరో సినిమాలో ఈమెను హీరోయిన్ గా కూడా ఎంపిక చేసే ప్రయత్నాలు జరిగాయి కానీ.. అభిమానులు అందుకు అడ్డు చెప్పడంతో కృష్ణ గారు వెనకడుగు వేశారు. అటు తర్వాత కొన్నాళ్ళకి మంజుల… సంజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది.’ఆరెంజ్’ సినిమాలో రాంచరణ్ అక్కా బావలుగా నటించింది వీళ్ళే..! ఇదిలా ఉండగా.. పెళ్ళికి ముందు వీరిద్దరు 7ఏళ్ళు ప్రేమించుకున్నారట.

పెద్దలను ఒప్పించడం కోసం అంత టైం పట్టినట్టు తెలుస్తుంది. అటు తర్వాత వాళ్ళు కూడా అంగీకరించడంతో పెద్ద తిరుపతిలో వీళ్ళు సింపుల్ గా వివాహం చేసుకున్నారట.వీరికి ఒక పాప. మంజుల ప్రేమకి కృష్ణగారు ఒప్పుకోకపోయినా మంజుల తల్లి ఇందిర గారు సపోర్ట్ చేసి అండగా నిలిచారట.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus