Rajashekar, Sridevi: రాజశేఖర్, శ్రీదేవి లకు పెళ్లి కావాల్సింది.. కానీ ఆమె వల్ల ఆగిపోయిందట..!

Advertisement

తమిళనాడుకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగులోనే స్టార్ అయ్యాడు రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మెన్ గా ఓ పక్క యాక్షన్ మూవీస్ లో నటిస్తూనే మరోపక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ కు అతిలోక సుందరికి వివాహం జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఎలా అంటే.. రాజశేఖర్, శ్రీదేవి ఇద్దరూ కూడా తమిళనాడుకి చెందిన వారే..!

రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీదేవి, రాజశేఖర్ లకు పెళ్లి చేయాలని కూడా వీళ్ళు నిశ్చయించారు. అప్పటికి రాజశేఖర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా రాణిస్తుంది.కానీ వీరి వివాహానికి రాజశేఖర్ తల్లిగారు ఒప్పుకోలేదట. సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోవద్దని ఆమె రాజశేఖర్ తో ప్రమాణం చేయించుకుందట. కానీ అనుకోకుండా రాజశేఖర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం…

అతను కూడా స్టార్ గా ఎదగడం జరిగింది. చివరికి ఇతను కూడా సినీ పరిశ్రమకి చెందిన జీవిత గారినే పెళ్లి చేసుకోవడం విశేషం.1991వ సంవత్సరంలో రాజశేఖర్ గారు ‘మగాడు’ అనే చిత్రం చేస్తున్న టైములో గాయాలు పాలయ్యారు. అయితే ఆ టైములో జీవిత గారు దగ్గరుండి రాజశేఖర్ కు సేవలు చేశారట. దీంతో రాజశేఖర్ తల్లిదండ్రులు వీళ్ళకి వివాహం చేసినట్టు.. ఈ దంపతులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus