Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

శింగనమల బొబ్బిలి ‘రణబాలి’గా (Ranabaali) ఈ నెల 16న థియేటర్లలోకి రాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ మాట్లాడుతూ సినిమా కథ ఆలోచన, టైటిల్‌ ఆలోచన గురించి చెప్పాడు. వాటి బ్యాక్‌ స్టోరీ గురించి కూడా మాట్లాడారు. ‘శ్యామ సింగ రాయ్‌’ సినిమా తర్వాత ఏ కథను సినిమాగా చేద్దాం అనుకుంటుండగా.. అతని దగ్గరకు ఓ బుర్ర కథ వచ్చిందట. అదే ‘రణబాలి’ అని చెప్పారు రాహుల్ సాంకృత్యాన్‌.

Ranabaali

నా దగ్గరకు వచ్చిన ఓ వీరుడి కథ విని ఆశ్చర్యపోయాను. అతడు దేవుళ్లతో మాట్లాడతాడు, రాక్షసులను కొట్లాడతాడు. పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తాడు. ఇలాంటి వీరుడి గురించి ఇన్నాళ్లు నాకు ఎందుకు తెలియలేదు. పుస్తకాల్లో ఎందుకు లేదు అనిపించింది. వెంటనే ఇలాంటి వీరుడి కథను సినిమాగా చేయాలని అనుకున్నాను. ఆ పాత్ర కోసం ఎవరైతే బాగుంటాడు అనిపించినప్పుడు విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు.

కథలో కంటెంట్‌ గురించి ఆలోచించినప్పుడు రాయలసీమ కరవు గురించి చదివాను. అదే కరవు రాయలసీమకే కాదు, కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ ప్రాంతానికి, మైసూరుకు కూడా వచ్చింది. దానిని గ్రేట్ సౌత్‌ ఇండియన్‌ మద్రాస్‌ ఫేమిన్‌ అని అంటారు. దాని గురించి చదివినప్పుడు షాకయ్యా. రెండు సంవత్సరాల్లో ఆ కరవు వల్ల కోటి మంది చనిపోయారు. దీని గురించి ఇంటర్నెట్‌లో సమాచారం ఉంది. దాని గురించి పుస్తకాలు చదివి, చరిత్రకారులను కలసి ఈ విషయం కన్ఫామ్‌ చేసుకున్నాను.

ఆవేశం నుండి పుట్టిన కథ ‘రణబాలి’ (Ranabaali). తారకాసుర సంహారంలో రణబాలీశ్వరుడిగా మారతాడు కుమారస్వామి. యుద్ధానికి ముందు రణబాలి అవతారం ఎత్తుతాడు. ఆయన్ను రణబాలి మురుగన్‌ అంటారు. దాని నుంచే ఈ సినిమాకు ‘రణబాలి’ (Ranabaali) అనే పేరు అని రాహుల్‌ సాంకృత్యాన్‌ చెప్పుకొచ్చారు. 150 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథను ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఉందని విజయ్‌, రాహుల్‌ అనుకుని రెడీ అయ్యారు. రెండు సంవత్సరాల రైటింగ్‌, రెండు సంవత్సరాల మేకింగ్‌లో ఇప్పుడు రెడీ అయింది.

 కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus