Bhola Shankar: ఈ ప్రముఖ సెలబ్రిటీల కెరీర్ ను భోళా శంకర్ మూవీ డిసైడ్ చేయనుందా?

Ad not loaded.

భోళా శంకర్ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా రిజల్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ చాలామంది కెరీర్ లను డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ సాధించినా ఈ సినిమాకు ముందు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం చిరంజీవి మార్కెట్ ఎంత అనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

భోళా శంకర్ (Bhola Shankar) సినిమాతో చిరంజీవి మార్కెట్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నాకు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు తగ్గాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మిల్కీ బ్యూటీ తమన్నాకు కొత్త ఆఫర్లు రావడంతో పాటు సినిమాలకు సంబంధించి క్రేజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.

హీరోయిన్ తమన్నా సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భోళా శంకర్ మూవీలో లాయర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సుశాంత్, కీర్తి సురేష్ సైతం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ కు ఈ సినిమా ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పదేళ్ల తర్వాత ఛాన్స్ దక్కిన దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాతో కచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. భోళా శంకర్ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ మూవీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ మూవీ తెరకెక్కనుంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus