రేపు ఏ సినిమా చూడాలనుకొంటున్నారు ??

  • August 3, 2017 / 11:25 AM IST

శుక్రవారం వచ్చిందంటే చాలు ఏం సినిమాలు విడుదలవుతున్నాయి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమా ఎలా ఉండబోతోంది అంటూ తెగ ఆలోచించేస్తుంటారు మూవీ లవర్స్. ఈ శుక్రవారం కూడా బోలెడు సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఏ సినిమాకి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి. ఈ శుక్రవారం (ఆగస్ట్ 4) ఆరు తెలుగు సినిమాలు, ఒక హిందీ సినిమా విడుదలవుతోంది.

నక్షత్రం : ఈవారం జనాల్ని థియేటర్లకి రప్పించడానికి అన్నీ లక్షణాలు ఉన్న చిత్రం “నక్షత్రం”. సందీప్ కిషన్-సాయిధరమ్ తేజ్-రెజీనా-ప్రగ్యాజైస్వాల్ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదట్లో జనాలకి ఆసక్తి లేకపోయినా విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రోమోస్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర విజయం ఆయన కెరీర్ కి చాలా కీలకం.

దర్శకుడు : సినిమాలో నటించిన హీరో పేరు కూడా చాలా మందికి తెలియదు. కానీ సినిమా నిర్మాత సుకుమార్ కావడం, ఆడియో ఫంక్షన్ కి రామ్ చరణ్, ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ లు ప్రత్యేక అతిధులుగా విచ్చేయడం, సినిమా మొదటి షో టికెట్ ను చిరంజీవి ఖరీదు చేయడం వంటివి సినిమాకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. తెలుగమ్మాయి ఈష కథానాయికగా నటించిన ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది.

ఈ రెండు సినిమాలు కాకుండా మరో నాలుగు చిన్న సినిమాలు రేపు విడుదలవుతున్నాయి. 1) వశం, 2) గ్రీన్ కార్డ్, 3) ఇదేం దెయ్యం, 4) నాకు నేనే తోపు తురుమ్. అలాగే.. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తాజా చిత్రం “జాబ్ హ్యారీ మెట్ సీజల్” కూడా రేపు విడుదలవుతోంది. తక్కువ బడ్జెట్ తోపాటు షారుక్ కెరీర్ లో అతి తక్కువ క్యాస్టింగ్ తో రూపొందిన సినిమా ఇది. సినిమా మీద ఖాన్ కి కూడా పెద్దగా నమ్మకం లేదనుకొంటా అందుకే పబ్లిసిటీ కూడా పెద్దగా చేయలేదు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం ఒక్కటే ప్రత్యేక ఆకర్షణగా విడుదలవుతున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా షారుక్ మునుపటి డిజాస్టర్ “రయీస్” దరిదాపులకైనా చేరుతుందో లేదో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus