Rakesh master: ఆ కారణంతోనే రాకేష్ మాస్టర్ అనాథాశ్రమంలో చేరారా?

  • June 19, 2023 / 10:51 PM IST

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించగా ఈయనకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి రాకేష్ మాస్టర్ తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. రాకేష్ మాస్టర్ తన భార్య పిల్లలు ఉన్నప్పటికీ ఈయన చివరి రోజులలో మాత్రం అనాధ ఆశ్రమంలో చేరారు.

ఇలా ఈయన ఆశ్రమంలో ఉండడానికి గల కారణాలను కూడా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఈయన కొంతకాలం క్రితం అబ్దుల్లాపూర్ మేట్ అనాధాశ్రమంలో చేరారు. అక్కడ చేరడానికి గల కారణాలను తెలియజేస్తూ… మానసికంగా ఎంతో కృంగిపోయిన నేను ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆశ్రమంలో చేరానని తెలిపారు. తాను ఏ విషయం మాట్లాడిన చాలా ముక్కు సూటిగా మాట్లాడతానని తెలిపారు.

అయితే ఒకసారి కార్ పార్కింగ్ విషయంలో ఇంటి ఓనర్ తో గొడవ పడటంతో తాను అక్కడ ఎందుకు ఉండాలని తన భార్య దగ్గరికి వెళ్ళగా తన భార్య కూడా తనని ఇంట్లోకి రానివ్వలేదని తెలిపారు. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటంతో చరణ్ అభిమానులు తన కొడుకుని చితకొట్టారట నేను ఇంట్లో ఉంటే తన పిల్లలకు హాని జరుగుతుందన్న ఆవేదనతో తన భార్య తనని ఇంట్లోకి రానివ్వకుండా నేను చచ్చినా కూడా నా మొహం కూడా చూడనని చెప్పారు.

ఇలా నా భార్య మాటలలోని బాధ నాకు అర్థమైంది అందుకే అక్కడ కూడా ఉండకుండా వచ్చేసాను.ఇక ఓ మహిళ నాకు ఎంతో సహాయంగా ఉంటూ తాను ఎక్కడికి వెళ్లినా నాతోనే ఉండడమే కాకుండా పూటకు కాస్త తిండి పెట్టేది అయితే అందరూ తనని నా మూడో భార్య అంటూ వార్తలు రాశారు. ఆమె నా మూడో భార్య కాదు అని రాకేష్ మాస్టర్ తెలియచేశారు. ఇలా తనని ఎన్నో విషయాలు మానసికంగా కృంగదీయడంతోనే తాను అందరికీ దూరంగా అనాథ ఆశ్రమంలో ఉండాల్సి వచ్చిందని ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus