Pawan Kalyan: పవర్ స్టార్ గొప్పదనానికి సంబంధించి ఇంతకు మించి సాక్ష్యం కావాలా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర హీరోలను గౌరవించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. పవన్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్ లలో బిజీగా ఉండగా ఈ నాలుగు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించడంతో పాటు కోరుకున్న విజయాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ కు కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటు ప్రభాస్, మహేష్, బన్నీ, చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీను చూసేలా చేశారు.

ఆ ఫ్లెక్సీలో “మీకు నచ్చిన హీరోను అభిమానించండి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించండి.. ఈసారి జనసేన వైపు చూడండి” అని పేర్కొన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన అభిమానులు ఈ ఫ్లెక్సీని చూపించగా ఈ ఫ్లెక్సీ పవన్ కంట పడింది. పవన్ తన చేతులతో ఆ ఫ్లెక్సీని పట్టుకుని అభిమానులకు చూపించడం గమనార్హం. పవన్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో సినిమాల కంటే రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. యూత్ లో పవన్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో సక్సెస్ అయితే సినిమాలకు దూరంగా ఉండటానికి కూడా సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ ను (Pawan Kalyan) అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కు సినిమాలకు సంబంధించి వరుస విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus