Raviteja: మజిలీ బ్యూటీకి రవితేజ హిట్టిస్తారా..?

రాజా ది గ్రేట్ సినిమా తరువాత సరైన సక్సెస్ లేని మాస్ మహరాజ్ రవితేజ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. క్రాక్ సినిమాతో రవితేజ తను హిట్ సాధించడంతో పాటు శృతిహాసన్ కు లైఫ్ ఇచ్చారు. శృతికి హిట్ ఇచ్చిన విధంగానే రవితేజ తమకు కూడా హిట్లు ఇస్తారని భావిస్తూ ముగ్గురు హీరోయిన్లు రవితేజను నమ్ముకున్నారు.

ఖిలాడి సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డింపుల్ హయాతి వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టు సాంగ్ చేశారు. ఆ పాట ద్వారా వచ్చిన గుర్తింపుతో ఖిలాడి సినిమాలో అవకాశం దక్కింది. డింపుల్ హయాతికి ఈ సినిమా తొలి సినిమా కాగా ఈ సినిమా హిట్టైతే మాత్రమే ఆమెకు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

మీనాక్షి చౌదరి ఇప్పటికే హీరోయిన్ గా ఒక సినిమాలో నటించగా ఆ సినిమా వల్ల మీనాక్షికి నటిగా గుర్తింపు రాలేదు. ఖిలాడీ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకుంటానని మీనాక్షి చౌదరి భావిస్తున్నారు. మరోవైపు ఉగాది పండుగ రోజున శరత్ డైరెక్షన్ లో రవితేజ కొత్త సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మజిలీలో సెకండ్ హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆ సినిమా తరువాత దివ్యాంశ కౌశిక్ కు తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకపోవడం గమనార్హం. ఈ హీరోయిన్ కూడా హిట్ విషయంలో రవితేజనే నమ్ముకుంది. రవితేజ ఈ హీరోయిన్లకు సక్సెస్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus