Jr NTR: టాలీవుడ్లో ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది..!

  • July 8, 2024 / 12:37 PM IST

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా గతేడాది చివర్లో వచ్చింది ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం. శౌర్యువ్ (Shouryuv) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతను మరెవరో కాదు పాపులర్ యూట్యూబర్ కమ్ యాంకర్ అయిన నిఖిల్ విజయేంద్ర సింహా అన్న. ఇక డిసెంబర్ 7 న రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. ఓపెనింగ్స్ సోసోగానే వచ్చినా.. తర్వాత బాగా పికప్ అయ్యింది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

నాని నటన, హేషమ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) మ్యూజిక్, క్లైమాక్స్, నాగేంద్ర కాశి (Nagendra Kasi) డైలాగ్స్ .. ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఈ ఒక్క సినిమాతో శౌర్యువ్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. చాలా మంది మిడ్ రేంజ్ హీరోలు ఇతనితో సినిమా చేయాలని ఆశపడ్డారు. అయితే ఇతను ‘కుంభస్థలాన్నే’ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ను (Jr NTR) ఒప్పించి సినిమా ఓకే చేసుకున్నాడు శౌర్యువ్ అంటూ ఇప్పుడు టాక్ బలంగా వినిపిస్తోంది.

శౌర్యువ్ ఎన్టీఆర్ ఇమేజ్ కి సెట్ అయ్యే ఓ పాన్ ఇండియా కథ డిజైన్ చేసుకుని ఎన్టీఆర్ కి వినిపించడం.. అది అతనికి నచ్చడం, వెంటనే ఓకే చెప్పేయడం అన్నీ చకా చకా జరిగిపోయాయట. ఈ చిత్రాన్ని కూడా ‘హాయ్ నాన్న’ నిర్మాతలు అయిన ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ వారే నిర్మించబోతున్నట్టు సమాచారం. ఏదేమైనా ఇది ఊహించని కాంబినేషన్ అనే చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus