Jai Hanuman: హనుమాన్ ను మించేలా జై హనుమాన్.. వాళ్లిద్దరిలో ఎవరు నటిస్తారో?

ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన టాప్ సినిమాలలో హనుమాన్ (HanuMan) మూవీ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ తో తేజ సజ్జా (Teja Sajja) మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరిగిందనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు ఈ సినిమా వల్ల దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. అయితే జై హనుమాన్ మూవీలో హనుమాన్ రోల్ లో చరణ్ (Ram Charan) కనిపిస్తారని తెలుస్తోంది.

చిరంజీవి (Chirajeevi) లేదా చరణ్ లలో ఎవరో ఒకరు ఈ పాత్రలో కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. హనుమాన్ నిర్మాతలలో ఒకరైన చైతన్య రెడ్డి జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని తెలిపారు. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమాకు ఈ రేంజ్ రీచ్ ను ఊహించలేదని చైతన్య రెడ్డి కామెంట్లు చేశారు.

మార్వల్ తరహా కథాంశం తీసుకుంటున్నామంటే ఆ రీచ్ ఉండాలి కాబట్టి కొంత సమయం తీసుకుని చేయాలని మా ఆలోచన అని ఆమె పేర్కొన్నారు. జై హనుమాన్ మూవీలో హనుమాన్ ఫ్రాంఛైజ్ లో నటించే హీరోలందరినీ పరిచయం చేస్తారని తెలుస్తోంది. జై హనుమాన్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని భోగట్టా.

జై హనుమాన్ మూవీ విజువల్ వండర్ గా తెరకెక్కనుందని ఈ సినిమాలో ట్విస్టులు సైతం మామూలుగా ఉండవని సమాచారం అందుతోంది. జై హనుమాన్ లో తేజ సజ్జా కూడా కనిపిస్తాడు కానీ ఆ పాత్ర నిడివి తక్కువని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచేలా ఈ మధ్య కాలంలో కొన్ని భారీ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus