Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

కమల్ హాసన్  (Kamal Haasan)  హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life ) అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. ‘నాయగన్’ తర్వాత.. అంటే దాదాపు 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. జూన్ 5న రిలీజ్ అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ పై ప్రభావం గట్టిగానే పడిందని చెప్పాలి. దీంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది.

Thug Life Collections:

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.36 cr
సీడెడ్ 0.18 cr
ఉత్తరాంధ్ర 0.18 cr
ఈస్ట్ 0.08 cr
వెస్ట్ 0.06 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 1.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.12 cr
టోటల్ వరల్డ్ వైడ్ 1.29 cr

‘థగ్ లైఫ్’ కి తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.12.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.1.29 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.02 కోట్లు అని చెప్పాలి. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus