Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

సినిమాకు టైటిల్‌ ఎంతగా ఉపయోగపడుతుంది అనే విషయంలో మీకేదైనా డౌట్‌ ఉంటే.. ‘ఇరుముడి’ సినిమా ఫలితం గురించి చూస్తే సరి. ఆ సినిమాకు జనాలు తండోపతండాలుగా వచ్చి చూసేశారు. సినిమా చూసి వెళ్లేటప్పుడు కొన్ని పదనిసలు వినిపించినా.. ఆ జనాల్ని థియేటర్లవైపు రప్పించిన అంశాల్లో మౌత్‌ టాక్‌ ఒకటి కాగా, రెండోది సినిమా టైటిల్‌. ఆ సినిమా టైటిల్‌తోనే ఆ మౌత్‌ టాక్‌ కూడా లింక్‌ అయి ఉంది అనుకోండి.

Thulabaram

ఇక అసలు విషయానికొస్తే.. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్‌ వల్లనో లేక సినిమా కథ అలా ఉందో కానీ.. రవితేజ తన తర్వాతి సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను అనుకుంటున్నారట. చాలా ఏళ్లుగా వరుసగా మాస్‌ టైటల్స్‌ పెట్టుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు వరుసగా రెండోసారి సాఫ్ట్‌ టైటిల్‌కే ఓటు వేశారట. అదే ‘తులా భారం’. ‘మెంట‌ల్ మ‌దిలో’, ‘బ్రోచేవారెవ‌రురా’, ‘అంటే సుంద‌రానికి’, ‘స‌రిపోదా శ‌నివారం’ టైటిల్స్‌ పెట్టిన వివేక్‌ ఆత్రేయదే ఈ టైటిల్‌ కూడా.

లక్ష్మణ్‌ నిర్మాణంలో రూపొందబోతున్న ఈ సినిమాను త్వరలో లాంఛనంగా మొదలుపెడతారట. అక్కడి కొన్ని రోజులకే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేస్తారట. మరి ఈ ‘తులాభారం’ కథేంటో తేలాలి అంటే.. సినిమా షూటింగ్‌ మొదలు అవ్వాల్సింది. తమిళ సినిమాల్లా ఈ సినిమాకు ఏదైనా ఓపెనింగ్‌ కాన్సెప్ట్ వీడియో రిలీజ్‌ చేస్తే.. అప్పుడు కథ విషయంలో పక్కాగా సమాచారం వస్తుంది.

‘ఇరుముడి’ సినిమా తర్వాత రవితేజ చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆయన కుమార్తె మోక్షద కూడా ‘ఇరుముడి’ సినిమాలాగే ఈ సినిమాను కూడా దగ్గర ఉండి చూసుకోవాలని అనుకుంటోందట. కాబట్టి ఈ సినిమాను కూడా జాగ్రత్తగా రవితేజకు తగ్గట్టుగానే రూపొందిచేలా చూసుకుంటుందట. ‘ఇరుమడి’ సినిమా విజయం ఆమెను అందరూ తెగ మెచ్చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘తులాభారం’ సినిమాకు కూడా మంచి విజయం వస్తే.. ఆమె టాలెంట్‌ మరింతగా ఎలివేట్‌ అవుతుంది.

వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus