Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

ప్రశ్నలు అడిగేది మేమే.. సమాధానాలు చెప్పేది మేమే.. చూసేది ప్రేక్షకులు.. దీన్ని ఇంటర్వ్యూ అంటారా? మాకు తెలిసి అయితే దీన్ని ఆ పేరుతో పిలవకూడదు. వాళ్లలో వాళ్లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం అంటారు. దానిని గ్రూప్‌ ఇంటర్వ్యూ, కామన్‌ ఇంటర్వ్యూ, చిట్‌ చాట్‌ అంటూ పేర్లు పెట్టి మీడియాకు ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటర్వ్యూలో భీమ భాగం ఇలాంటి ఇంటర్వ్యూలే. హోస్ట్‌లో మారుతున్నారు కదా వేర్వేరు ఇంటర్వ్యూలే అనుకోవచ్చు..

Tollywood

కానీ, ఎంతమంది హోస్ట్‌లు మారినా, సెటప్‌ వారిదే, మాటలు వారివే, ప్రశ్నలూ వారివే. ఎప్పుడో కానీ ప్రశ్నలు వేసే అవకాశం మీడియాకు రావడం లేదు. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్‌ సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీని ఫాలో అవుతోంది అని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మీడియా ముందుకొచ్చి ప్రశ్నలు అడగండి, మేం సమాధానాలు చెబుతాం అని అనుకున్న సినిమా జనాలు ఇప్పుడు మేమే అన్నీ చూసుకుంటాం.. అవసరమైతే సోషల్ మీడియాలో మాట్లాడేస్తాం అంటున్నారు.

ముఖ్యంగా పెద్ద సినిమాల టీమ్‌లు నేరుగా మీడియా వారిని కలిసే పరిస్థితి లేదు. ప్రింట్ మీడియా కానీ, టీవీ మీడియా కానీ, వెబ్‌ మీడియా కానీ.. పెద్ద హీరోల సినిమాల వాళ్లతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ఇదంతా ఎందుకు అని చూస్తే.. వాళ్లు బయటకు వచ్చినప్పుడు మాట్లాడే విషయాలు, అడిగే ప్రశ్నలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అలా మీడియాకు ముఖం చాటేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చెప్పొచ్చు.

ఒకరిద్దరు వ్యక్తులు వేసే ప్రశ్నల వల్ల ఇబ్బంది ఉంటే.. వారిని దూరం పెట్టాలి కానీ.. మొత్తం మీడియాను దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. అలా అని ప్రశ్నలకు, మాటలకు సినిమా నటులు, సాంకేతిక నిపుణులు భయపడుతున్నారు అంటే.. కొంతమంది ఏకంగా మీమర్స్‌ అందరినీ ఒక దగ్గరకు చేర్చి వారితో చిట్‌చాట్‌ చేస్తున్నారు. వాళ్ల కంటే మీడియా ఎక్కువ చేయదు కదా. అందుకే మీడియా లేని టాలీవుడ్‌ను త్వరలో చూస్తామేమో అనే డౌటనుమానం కలుగుతోంది.

ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus