Tiger 3 First Review: ‘టైగర్ 3’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 9, 2023 / 05:29 PM IST

ఈ దీపావళి పండుగకి అన్నీ డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘టైగర్ 3 ‘ ఒకటి. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ ది టైగర్’ ‘టైగర్ జిందా హై’ చిత్రాలకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు కనిపిస్తున్నాయి.

సినిమాలో కూడా అవి హైలెట్ అవుతాయని అంతా అనుకుంటున్నారు. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి కథ అందించడం కూడా జరిగింది. ట్రైలర్లో హీరోయిన్ కత్రినా కైఫ్ వైట్ టవల్ లో వేరే అమ్మాయితో చేస్తున్న ఫైట్ సీన్ బాగా వైరల్ అయ్యింది. ప్రమోషన్స్ లో కూడా ఆ ఫైట్ గురించి చిత్ర బృందం ఎక్కువగా చెబుతూ వచ్చింది. అది కూడా సినిమా పబ్లిసిటీకి హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి (Tiger 3) ప్రముఖ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. అతనొక ఫేక్ రివ్యూయర్ అనే సంగతి తెలిసిందే. సినిమా చూడకపోయినా సరే రివ్యూ ఇచ్చేస్తూ ఉంటాడు. కొంతమంది దర్శకనిర్మాతలు ఇతని పై కేసు వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ… అతను రివ్యూ అంటూ ట్వీట్ వేస్తె అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ‘టైగర్ 3 ‘ పై అతను స్పందిస్తూ.. “సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి.

అయితే అవి తప్ప ఇందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. బాగా తెలివైన వాళ్లకి తప్ప.. ఇలాంటి స్క్రీన్ ప్లే ఎవ్వరికీ నచ్చదు. అనవసరపు సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. నేనైతే ఈ సినిమా చూసి నిరుత్సాహంతో బయటకు వచ్చాను” అంటూ రాసుకొచ్చాడు.అంతేకాదు అతను ఈ సినిమాకి 2 /5 రేటింగ్ ఇచ్చాడు. ఇది చూసి సల్మాన్ ఖాన్ అభిమానులు అతన్ని తిట్టిపోస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus