Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ లో మెయిన్ ట్విస్ట్ అదేనట..!

  • March 27, 2024 / 05:34 PM IST

సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)  హీరోయిన్ గా మల్లిక్ రామ్ (Mallik Ram)  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టిల్లు స్క్వేర్'(Tillu Square). 2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ కి ఇది సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ‘డిజె టిల్లు’ కి (DJ Tillu)  విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా..సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది. ఇటీవల టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘టిల్లు స్క్వేర్’ పై కూడా నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. ‘టిల్లు స్క్వేర్’ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే.. ‘టిల్లు స్క్వేర్’ సెకండ్ హాఫ్లో హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) కూడా కనిపిస్తుందట. ‘డిజె టిల్లు’ లో ఆమెనే హీరోయిన్ అనే సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పాత్ర వల్లే హీరో అనేక సమస్యల్లో చిక్కుకుంటాడు.

చివరికి అతన్ని మోసం చేసే అమ్మాయి రాధిక పాత్రలో నేహా శెట్టి కనిపిస్తుంది. ఇక ‘టిల్లు స్క్వేర్’ సెకండ్ హాఫ్ లో ఆమె 15 నిమిషాల పాటు కనిపిస్తుందట. ఆ 15 నిమిషాలు సినిమా హిలేరియస్ గా అనిపిస్తుందట. సినిమా మొత్తానికి నేహా శెట్టి ట్రాక్ కూడా హైలెట్ గా అనిపిస్తుంది అని ఇన్సైడ్ టాక్. ‘టిల్లు’ ఫ్యాన్స్ కోసం ఇది సర్ప్రైజ్ గా దాచి ఉంచినట్టు తెలుస్తుంది.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus