Prabhas , Hanu Raghavapudi: మహేష్ టైటిల్ ను ప్రభాస్ మూవీకి ఫిక్స్ చేశారా.. అసలేమైందంటే?

  • May 6, 2024 / 08:59 PM IST

ప్రభాస్ (Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అద్భుతమైన టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం అందుతోంది. ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీకి ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ పదానికి సైనికుడు అనే అర్థం వస్తుంది. అన్ని భాషలకు ఈ టైటిల్ సూట్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ (Mahesh Babu) గుణశేఖర్ (Gunasekhar) కాంబినేషన్ లో ఇప్పటికే సైనికుడు (Sainikudu) అనే టైటిల్ తో సినిమా తెరకెక్కిన నేపథ్యంలో ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహేష్ టైటిల్ ను ప్రభాస్ మూవీకి ఫిక్స్ చేశారా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

సీతారామం (Sita Ramam) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన హను రాఘవపూడి ప్రభాస్ తో ఎలాంటి సినిమా తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. హను రాఘవపూడి ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హను రాఘవపూడి తన సినిమాల సెకండాఫ్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటుండగా ఈ సినిమా విషయంలో సైతం ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. హను రాఘవపూడి దర్శకుడిగా తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. వరుస విజయాలతో హను అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఆయన టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ హను కాంబో మూవీ 2026 సంవత్సరంలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus