Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేది హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్‌లు అనుకుంటారు కానీ.. వీరందరి కంటే ముఖ్యమైనది టైటిల్‌. సినిమాకు గుర్తింపు లభించేది ఆ టైటిల్‌తోనే. ‘ఏ సినిమాకు వెళ్తున్నావ్‌ అంటే ఫలానా హీరో సినిమాకు అనో, ఫలానా హీరోయిన్‌ పిక్చర్‌కి అనో, ఆ దర్శకుడు సినిమాకు అనో’ చెప్పారు. సినిమా పేరు పెట్టి చెబుతారు. అలాంటి సినిమా పేరును రిలీజ్‌కి కొన్ని రోజుల మందు మారిస్తే.. ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఇండియన్‌ సినిమాలో అదే జరుగుతోంది.

Title Issue

సెన్సార్‌ కమిటీ వాళ్లు సినిమా చూశాక ఏ, యు, యు/ఏ అంటూ సర్టిఫికెట్‌లు ఇస్తూ ఉంటారు. వాటికి తగ్గట్టుగా ప్రేక్షకుల్ని థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకుల్ని చూడనివ్వాలి. ఈ అంశం అమలులో ఉన్నా.. ఎక్కడా ఆచరణలో లేదు. దీనిపై పెద్దగా పట్టింపు కూడా లేదు. ఏ సర్టిఫికెట్‌ సినిమాను చూస్తున్న పిల్లలు ఎంతమందో మీకు కూడా తెలుసు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు సెన్సార్‌ బోర్డు దృష్టి సినిమా టైటిళ్ల మీద పడింది. ఎలాంటి టైటిల్‌ పెట్టాలి, ఎలాంటి టైటిల్‌ పెట్టకూడదు అని చెబుతున్నారు.

ఎంతలా చెబుతున్నారు అనేది తెలియాలంటే ఈ మధ్య రిలీజ్‌కి దగ్గర్లో టైటిల్స్‌ మార్చుకున్న సినిమాలు చూస్తే సరి. ‘హే భగవాన్’.. ‘హే బలవంత్‌’గా మారింది. ‘ఛాయ్ వాలా’ కాస్తా ‘నవాబ్ కేఫ్’గా మారింది. ‘శ్రీ చిదంబరం’ టైటిల్‌కు ‘గారు’ యాడ్‌ చేయమన్నారు. ఇక రీసెంట్‌ ఛేంజ్‌ ‘సరస్వతి’ అంటే దేవత కాబట్టి దానికి ముందు ‘ఎస్’ అని ఇంటి పేరు పెట్టమన్నారు. ఇంతలా టైటిల్స్‌ విషయంలో సెన్సార్‌ బోర్డు పట్టుబట్టి మరీ మార్పిస్తోంది.

ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన టైటిల్స్‌, వాటి విషయంలో సెన్సార్‌ బోర్డు తీరును పలువురు ఇప్పడు గుర్తు చేస్తున్నారు. వెకంటేశ్‌ ‘లక్ష్మి’, కల్యాణ్‌ రామ్‌ ‘విజయదశమి’, వేణు ‘దీపావళి’, శ్రీహరి ‘సింహాచలం’, ‘భద్రాచలం’, నితిన్‌ ‘శ్రీ ఆంజనేయం’, పవన్‌ కల్యాణ్‌ ‘అన్నవరం’, అల్లు అర్జున్‌ ‘గంగోత్రి’ ఇలా చాలానే సినిమాలకు ఎలాంటి అభ్యంతరం రాలేదు. ఇప్పుండెందుకు ఇంత పర్టిక్యులర్‌ టైటిళ్లపై దృష్టి పెట్టారో తెలియడం లేదు. ఇదే ఒరవడి కొనసాగితే రాజమౌళి – మహేష్‌బాబు సినిమా ‘వారాణాసి’ టైటిల్‌ మార్చాల్సి వస్తుందేమో. ఈ ఇబ్బంది రాకూడదు అంటే టైటిల్‌ని తొలుత సెన్సార్‌ బోర్డుకు పంపి ఓకే చేయించుకోవడం మంచిది.

వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus