తండేల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న చిత్రం వృష కర్మ. విరూపాక్ష తో బ్లాక్ బస్టర్ అందించిన కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఎస్వీ సి సి బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈరోజు గ్లింప్స్ ను వదిలారు.
ఈ సినిమా గ్లింప్స్ విషయానికి వస్తే…ఇది 2 నిమిషాల 6 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఒక మనిషి నోట్లో నుండీ గబ్బిలం బయటికి వచ్చి ఇంకో మనిషిని చంపి వెళ్ళిపోతున్న విజువల్స్ తో గ్లింప్స్ మొదలైంది. అతీంద్ర శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృష కర్మని ఎంచుకుంటుంది అనే డైలాగ్ తో సినిమా థీమ్ ను తెలియజేశారు.నాగ చైతన్య మేకోవర్ కొత్తగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా బాగా కష్టపడినట్టు విజువల్స్ చెబుతున్నాయి.
విరూపాక్ష స్టైల్ లో బ్లాక్ మ్యాజిక్, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి రోల్ కూడా కొత్తగా అనిపిస్తుంది. అజనీష్ లోకానాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కంటెంట్ మూడ్ కి తగినట్టు ఉంది. విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. నిర్మాత బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా గ్లింప్స్ ను మీరు కూడా ఒక లుక్కేయండి: