Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Advertisement

2 రోజుల క్రితమే స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. సినీ పరిశ్రమని సైతం తీవ్ర విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.

Tollywood

ఈ షాక్ నుండి సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్..కి(Tollywood) చెందిన ఓ నటుడు, సినిమాటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం తెల్లవారుజామున, హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ‘టెనెంట్’ సినిమా ఫేమ్ యువ నటుడు అయినటువంటి భరత్ కాంత్ అలాగే అతనితో పాటు కెమెరామెన్ త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.భరత్, త్రిలోక్ 10 ఏళ్ళ క్రితమే సినీ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటి నుండి నానక్‌రామ్‌గూడలో నివసిస్తున్నారు.

శనివారం పర్సనల్ వర్క్ ఉండటంతో సొంతూరు వెళ్లి, తిరిగి కారులో నగరం వైపు వస్తుండగా ఈ విపత్తు సంభవించినట్టు తెలుస్తుంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, పెద్ద అంబర్‌పేట నుండి శంషాబాద్ వైపు వెళ్తుండగా.. బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరి కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టినట్టు సమాచారం.ఆ ధాటికి కంటైనర్ లారీ వెనుక చక్రాలు సైతం ఊడిపోయాయి.

కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ క్రమంలో కారు లోపల ఉన్న భరత్, త్రిలోక్ ఇద్దరూ అక్కడికక్కడే కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. ఆదిభట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. కత్తి మోహనరావు కుమారుడైన భరత్, గూడా మాల్యాద్రి శర్మ కుమారుడైన త్రిలోక్.. వీరిద్దరి వయసు 31 ఏళ్ళే కావడం గమనార్హం. ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఎదుగుతున్న క్రమంలో వీరికి ఇలా జరగడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus