టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర యంగ్ హీరోలతో పోటీ పడుతూ మన సీనియర్ స్టార్లు కూడా సత్తా చాటుతున్నారు. రీసెంట్ ట్రేడ్ లెక్కల ప్రకారం.. సీనియర్ హీరోల టాప్-5 హయ్యెస్ట్ గ్రాసింగ్ సినిమాల లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఏకంగా రూ.303 కోట్ల నుంచి రూ.375 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి.. మెగాస్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు, పాన్ ఇండియా సినిమాలకు దీటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఈ టాప్-5 లిస్ట్‌లో మెగాస్టార్ హవా మామూలుగా లేదు. ఏకంగా నాలుగు స్థానాలను ఆయన సినిమాలే ఆక్రమించడం విశేషం.
రూ.256 కోట్ల నుంచి రూ.300 కోట్ల కలెక్షన్స్‌తో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మూడు, నాలుగు, ఐదు ప్లేస్‌లలో వరుసగా చిరు నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ (రూ.240 కోట్లు), ‘వాల్తేరు వీరయ్య’ (రూ.236 కోట్లు), ‘ఖైదీ నెం.150’ (రూ.165 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.అయితే ముందు ముందు ఈ రికార్డులు మరింత బద్దలయ్యే ఛాన్స్ ఉంది.
చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ ఏకంగా రూ.400 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేస్తోంది. మరోవైపు వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47 (AK 47)’ షూటింగ్ అప్పుడే మొదలైపోయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సమ్మర్‌కు రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులతో సీనియర్ల బాక్సాఫీస్ రేంజ్ ఇంకెక్కడికి వెళ్తుందో చూడాలి.