Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Advertisement

టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోలు ఇప్పుడు కంప్లీట్‌గా కొత్త రూట్లో వెళ్తున్నారు. పాత మూస ఫార్ములాలు పక్కనపెట్టి.. ఆడియన్స్‌కు సరికొత్త లోకాలను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.

Tollywood

మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి కుర్ర హీరోల వరకు.. రాబోయే రెండు మూడేళ్లలో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయబోయే క్రేజీ సినిమాల లైనప్, వాటి జానర్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు మాస్ సినిమాలంటే కమర్షియల్ ఫార్మాట్ ఉండేది. కానీ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, రవితేజ లాంటి స్టార్లు కూడా రూటు మారుస్తున్నారు. గోపీచంద్ మలినేనితో బాలయ్య చేయబోయే ప్రాజెక్ట్ ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుండగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో సైలెంట్ మాఫియా డాన్‌గా ఆయన కనిపించనున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ‘విశ్వంభర’తో సోషియో ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తూనే.. బాబీ డైరెక్షన్‌లో అండర్ వరల్డ్ డాన్‌గా, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రక్తపుటేరులు పారించే పవర్ ఫుల్ రోల్‌లో రాబోతున్నారు. మరోవైపు రవితేజ హసిత్ గోలి దర్శకత్వంలో ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌తో అలరించనుండగా.. విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఫ్యామిలీ టచ్ ఉన్న క్రైమ్ డ్రామా తెరకెక్కబోతోంది.

ఇక పాన్ ఇండియా స్టార్ల లైనప్ చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగా ‘స్పిరిట్’ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రచ్చ చేయనున్నారు. అలాగే హను రాఘవపూడి ‘ఫౌజి’లో ప్రేమ, యుద్ధం నేపథ్యంతో ఎమోషనల్ రైడ్ ఇవ్వనున్నారు. కలియుగాంతం బ్యాక్‌డ్రాప్‌లో ‘కల్కి 2’ ఎలాగూ ఉండనే ఉంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా ఏకంగా వరల్డ్ వైడ్ డిస్ట్రక్షన్ (విధ్వంసం) థీమ్‌తో హై-వోల్టేజ్ యాక్షన్‌గా రానుంది.

‘పెద్ది’తో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కనిపిస్తున్న రామ్ చరణ్.. ఆ వెంటనే సుకుమార్‌తో చేయబోయే మూవీ ‘రంగస్థలం’ను మించేలా ఉండబోతోందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్‌లో అడుగుపెడుతూనే, లోకేష్ కనగరాజ్‌తో ఓ మైండ్ బ్లాంకింగ్ సబ్జెక్ట్ చేయబోతున్నారు.వీరికి ఏమాత్రం తీసిపోకుండా మిడ్-రేంజ్ హీరోలు సైతం ట్రెండ్ సెట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ లైనప్ చాలా వెరైటీగా ఉంది.

గౌతమ్ తిన్ననూరి ‘రణబాలి’లో ప్రీ-ఇండిపెండెన్స్ ఎరా, రవి కిరణ్ కోలా “రౌడీ జనార్ధన్”లో 90ల నాటి విలేజ్ పాలిటిక్స్, శౌర్యువ్‌ కాంబోలో ప్యారలల్ మైథాలజీ వరల్డ్, రాహుల్ సంకృత్యన్ ‘స్వారీ’లో రేసుగుర్రాల బ్యాక్‌డ్రాప్‌లో కనిపించనున్నాడు. అటు న్యాచురల్ స్టార్ నాని సుజీత్ డైరెక్షన్‌లో స్టైలిష్ యాక్షన్ డ్రామా చేస్తుండగా.. సాయి దుర్గా తేజ్ ‘KA’ డైరెక్టర్లతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు. నిఖిల్ ‘స్వయంభూ’తో పాటు లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ది ఇండియన్ హౌస్’, సందీప్ కిషన్.. కృష్ణ చైతన్యతో రా అండ్ రస్టిక్ మూవీ చేస్తున్నారు.

కొడుకు సినిమా చూసి కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus