‘అలియాస్ జానకి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనీషా ఆంబ్రోస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘గోపాల గోపాల’ ‘రన్’ ‘మనమంతా’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ఓ దశలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో ఈమెనే హీరోయిన్ అని ప్రచారం జరిగింది. ఆ చిత్రానికి మొదట సంపత్ నంది దర్శకుడు అని అనుకున్న టైములో ఈ అనీషా పేరు ఎక్కువ వినిపించింది.
కానీ ‘పవర్’ ఫేమ్ బాబీ డైరెక్టర్ వచ్చాక ఈమె ఈ ప్రాజెక్ట్ లో లేదు అనే విషయం భయటకు వచ్చింది. ఈమె ఎందుకు తప్పుకుంది అనే విషయం వెనుక ఉన్న కారణాలు ఏంటి అన్నది ఇప్పటికీ తెలీదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ యంగ్ హీరోయిన్ ప్రెగ్నెంట్ అనే వార్తలు ఊపందుకున్నాయి.అవును …. ఇప్పుడు ఈ యువ కథానాయిక తల్లి కాబోతోందట. లాస్ట్ ఇయర్ మే చివర్లో గుణ జక్క అనే యువ పారిశ్రామికవేత్తని పెళ్ళి చేసుకుంది అనీషా.
ఇప్పుడీమె తల్లి కాబోతుంది అనే విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ అయిన ‘బిగ్ బాస్2’ కంటెస్టెంట్ మరియు నటి అయిన తేజస్వి మాదివాడ సోషల్ మీడియాలో తెలిపింది. దీంతో అనీషా ఫాలోవర్స్ అంతా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ … కామెంట్స్ పెడుతున్నారు.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!